ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులు కాంగ్రెస్ వారిని అడ్డుకుంటున్నారు

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులు కాంగ్రెస్ వారిని అడ్డుకుంటున్నారు
  • వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద.సుధాకర్ రెడ్డి తనను సొంత వార్డులో తిరగనియకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెతుకు ఆనంద్  అనుచరులు పండుకుంటున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ నాయకులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

స్థానిక కౌన్సిలర్ కు తన వార్డులో తిరిగే హక్కు లేదా.?ప్రజాస్వామ్యం ఎటుపోతుంది. రాజారికపాలనకు నేటితో అంతం పలకాలి అని అన్నారు.
తనపై జరిగిన బీఆర్ఎస్ వారు దాడి చేశారనీ మీడియా ముందు బి టి ఎస్ వార్డ్ కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద. సుధాకర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా నా సొంత వార్డులో తిరిగి హక్కు నాకు లేదా అని ప్రశ్నించారు. కావాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న బీ ఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని  ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలు సహించరని ఈ సందర్భంగా తెలియజేశారు.