చిత్తూ.. చిత్తుల జీ.వో.. సీఎం ఇచ్చిన జీ.వో అంటూ బాషా పండితుల పాట

చిత్తూ.. చిత్తుల జీ.వో.. సీఎం ఇచ్చిన జీ.వో అంటూ బాషా పండితుల పాట

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: బాషా పండితులు వారి ఆవేదనను,బాధలను ప్రభుత్వం గుర్తించాలని ప్రతి దినం ఓ వినూత్న రీతుల్లో నిరసనలు తెలుపుతున్నారు.తాజాగా బతుకమ్మ పాటల రూపంలో ప్రభుత్వంపై పాట గట్టి నిరసనకు బయలెల్లనున్నారు. పాట ఎట్లా కట్టారనేది మీరే చదవండి. 

1.చిత్తూ..చిత్తూల జీ.ఒ 
సీ.ఎం ఇచ్చిన జీ.ఒ
బంగారు తెలంగాణ లోనా
పండీతులాకు "చిత్తూ"
2. నిండూ సభలాలోన మెండూగ
జెప్పినాడు
మొండిచేయి జూపించెనమ్మా
పండితులాకు"చిత్తూ"
3. పెద్దా బళ్ళోన కొలువు
వద్దాని మొత్తుకున్నా
వెట్టిచాకిరెందుకొచ్చెనమ్మా
పండీతులాకు"చిత్తూ"
4.పంతుళ్ళందరికి పదోన్నతి
పండగొస్తె
ఎదుగుబొదుగు లేని
బతుకులాయె పండీతులకు"చి"
5. ఉద్యోగోన్నతికొరకు
ఉద్యమాలబాటవట్టి
పోరాటం చేద్దాము రండీ
పండీతులార..
పోరాట ధీరులై రండీ
పండీతులార ..
సంకల్ప సూరులై రండీ
పండీతులార..
గమ్యాన్ని ముద్దాడ రండీ
పండీతులార..
విజయా వీరులై రండీ
పండీతులార..