వికారాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ 

వికారాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో కొనసాగుతున్న పోలింగ్ పరిస్థితులు, ఓటింగ్ సరళిని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు ఆకాష్, ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలసి  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పరిశీలించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయనీ తెలిపారు.