వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణ రెడ్డి బాధ్యతల స్వీకరణ

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణ రెడ్డి బాధ్యతల స్వీకరణ
Narayana Reddy assumed responsibility as the new collector of Vikarabad district

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా 2009 బ్యాచ్ కు చెందిన ఐ ఏ ఎస్ అధికారి సి నారాయణ రెడ్డి గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోనీ కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న సి నారాయణ రెడ్డిని వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ సాధనలో అతడి గురించి విన్నట్లయితే.. 
కష్టాలనే మెట్లుగా మలుచుకున్నాడు.

చివరకు 2009లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి నాలుగో ర్యాంకును సాధించాడు.వికారాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లాలోని అధికారులు,ప్రజా ప్రతినిధులు అందరితో కలిసి ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా ముందుకు కొనసాగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిపించెలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.