దేశంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

దేశంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
  • తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కంసాన్పల్లి, గోటిగ్గకలాన్, గోటిగా కుర్దు గ్రామాల్లో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయనీ మాట్లాడుతు బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు ఇతర పథకాలను అందిస్తుందని తెలిపారు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా  ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.కర్ణాటకలో ఒక శాతం పెన్షన్ కూడా ప్రజలకు ఇవ్వడం లేదనీ స్పష్టం చేశారు.తెలంగాణలో 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.దేశంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు.

రైతులకు మనం నాణ్యమైన, ఉచిత విద్యుత్ ను 24 గంటలు ఇస్తూ ఉంటే కాంగ్రెస్ కర్ణాటకలో ఐదు గంటలు మాత్రమే ఇస్తుంది కారు గుర్తుకు ఓటేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే 16 వేల రూపాయల రైతుబంధు ఇస్తా 2016 రూపాయల పెన్షన్ 5016గా చేసుకోబోతున్నాం సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకి 3000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. రూ. 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ ని అధికారం చేపట్టిన వెంటనే రూ. 400 చేస్తున్నామని తెలిపారు.దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందించబోతున్నాం డ్వాక్రా మహిళల అభ్యున్నతికై డ్వాక్రా భవనాలను ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో ప్రభుత్వమే కట్టిస్తుందనీ  తెలిపారు.కాంగ్రెస్ అభ్యర్థి మన ఊరు, మన ప్రాంతానికి చెందిన వాడు కాదు.ఇంటోడు ఇంటోడే.. బయటివాడు బయటోడే అని అన్నారు.