భర్త  విజయం  కోసం భార్య ప్రచారం

భర్త  విజయం  కోసం భార్య ప్రచారం

తాండూరులో పైలట్  రోహిత్ రెడ్డి గెలుపుకు ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి ముమ్మర ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సతీమణి  ఆర్తి రెడ్డి తన భర్త  ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆమె నియోజకవర్గంలోని యాలాల మండలం కోకట్ గ్రామంలో మంగళ వారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి మాట్లాడుతూ తాండూర్ అభివృద్ధి కోసం పేద ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తన భర్త పైలట్ రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీతో విజయం చేకూర్చాలని కోరారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తాండూర్ నియోజకవర్గంలో రూ. 1680 కోట్లు అభివృద్ధి పనులకు, రూ.  1700 కోట్లు పేదల సంక్షేమానికి ఖర్చు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి మాట్లాడుతూ తమది తాండూర్ సొంత నియోజకవర్గం అని అందువల్ల తాండూర్ అభివృద్ధికి తాము తమ కుటుంబం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఇతర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తాండూర్ నియోజకవర్గం ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటుందని, మున్ముందు ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు.

మీ ఆశీర్వాద బలమే విజయానికి పునాది అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఆమె చేసిన ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆర్తీ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచి కారు గుర్తును గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, యువకులు అభిమానంతో ఓటేసి ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలన్నారు. కాంగ్రెస్ మాట లను నమ్మి దగా పడి ఇబ్బంది పడద్దని సూచించారు.

 తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజా ర్టీతో గెలిపించాలని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి ఆమె చేసిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఆర్తీ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచి కారు గుర్తును గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, యువకులు అభిమానంతో ఓటేసి ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలన్నారు. కాంగ్రెస్ మాట లను నమ్మి దగా పడి ఇబ్బంది పడద్దని సూచించారు. ప్రజా ఆశీర్వాదమే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాదన్నారు.