ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి

ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:తాండూరు పట్టణంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా మంళవారం వార్డు నెంబర్ 3 ,4 లో  తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  సతీమణి ఆర్తి రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆర్తి రెడ్డి  మాట్లాడుతూ వారంటీ గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అడ్రస్సు లేని పథకాలు ఆరుగ్యారెంటీలు అని అన్నారు.కాంగ్రెస్ బిజెపి పార్టీలు చేసె మోసపూరితమైన మాటల్ని అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మరొక్కసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి అవకాశం ఇచ్చి తాండూరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఆర్తి రెడ్డి  వెంబడి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ , మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు , తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ శ్రీనివాస్ చారి , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభ రాణి , మహిళా అధ్యక్షురాలు సంగీత ఠాగూర్ , కౌన్సిలర్ అస్లం , మాజీ కౌన్సిలర్ సిహెచ్ అనురాధ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసిం, మాజీ ఉర్దూగర్ చైర్మన్ సలీం గారు, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, వార్డు ఇన్చార్జ్ అక్రమ్ , సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ టైలర్,యువ నాయకులు అనంత్ రెడ్డి, వెంకట్ సుబ్బు, బోయ నరేష్, మల్లేష్ యాదవ్, మహిళా నాయకులు అనిత రమేష్, నిర్మల మరియు వార్డు మహిళలు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.