బీజేపీ లో చేరిక 

బీజేపీ లో చేరిక 

మోత్కూర్(ముద్ర న్యూస్):మోత్కూరు మున్సిపాలిటీలొని కొండగడప గ్రామానికి చెందిన సుమారు పదిమంది కార్యకర్తలు నాగారం లో తుంగతుర్తి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కడియం రామ చంద్రయ్య సమక్షంలో పోచం సోమయ్య ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే బీసీ ముఖ్యమంత్రి కి అవకాశం కల్పించడం  పార్టీల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించడం కేంద్రంలో అవినీతి రహిత పాలన  కేంద్ర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడం నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరామని తెలిపారు. చేరిన వారిలో వరికుప్పల యాదయ్య, వరికుప్పల శ్రీనివాస్ ,శివరాత్రి వెంకటేష్, శివరాత్రి నర్సయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.