పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, మోమిన్ పేట్ మండలాలలో పర్యటించి అకాలవర్షం, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

మర్పల్లి లో హెలిప్యాడ్ సమీపంలో రైతులనుద్దేశించి మంత్రులు మాట్లాడుతూ...రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు

మర్పల్లి, మోమిన్ పేట రెండు మండలాలలో గల దాదాపు 13 గ్రామాలలో 2 వేయిల ఎకరాలలో పంటనష్టం జరిగింది అని తెలిపారు

రేపటిలోగా పంట నష్టం పై సమగ్ర నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ కమిషనర్,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు మంత్రులు ఆదేశించారు

మంత్రుల వెంట రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ఉద్యాన సంచాలకులు హనుమంతరావు , ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ,కలెక్టర్ నారాయణ్ రెడ్డి ,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

జొన్న, టమాటా, ఉల్లిగడ్డ, కాలీఫ్లవర్ పంటలు వడగండ్ల వానకు తీవ్ర నష్టం జరిగింది అని తెలిపారు