పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం

ఇబ్రహీంపట్నం, ముద్ర : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలో కురిసిన ఆకాల వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన పొలాలను యాచారం, మంచాల మండలాల్లో ఆర్డీఓ వెంకటాచారి, వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటించి ఆయన పరిశీలించారు. 

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షంతో వరి, మామిడి, కూరగాయల, పండ్ల తోటలకు నష్టం జరిగిందని అన్నారు. ఆయా మండలాల్లో వడగళ్లతో నష్టపోయిన పంట నష్టం వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లడి తక్షణమే సహాయ అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వడగళ్లకు గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైనా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. కొంతమంది ఇళ్ళు కూలిపోయి నిరాశ్రయులయ్యారని వారిని ఆదుకునేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. పూర్తిగా ఇళ్ళు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

 ఎమ్మెల్యే వెంట రాష్ట్ర నాయకులు క్యమ మల్లేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మా రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ కోతకుర్మ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, అర్డిఓ వెంకటాచారి, ఎంపీపీ నర్మద, ఎంఆర్ఓ సుచరిత, వ్యవసాయ శాఖ ఏడీ సత్యనారాయణ, ఎంపిడిఓ విజయలక్ష్మి, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్ గౌడ్, చీరాల రమేష్, బహదూర్, పచ్చ బాషా, బద్రీనాథ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.