తాగి పోలీసులకు చిక్కాడు..చివరికి..!!

తాగి పోలీసులకు చిక్కాడు..చివరికి..!!
Drunk and drive checking

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: మద్యం సేవించి పట్టుబడితే పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తున్నారు. తాజాగా శుక్రవారం రోజున వికారాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఓ వ్యక్తికి రెండు వేల జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మర్పల్లి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనోజ్ కుమార్ అనే వ్యక్తి మద్యం సేవించి పట్టుబడడంతో కోర్టులో హాజరుపరచగా అతడికి ఈ శిక్ష విధించారు.

కావున మద్యం ప్రియులారా తస్మాత్ జాగ్రత్త. తాగి బండి నడుపుతూ పోలీసులకు చిక్కితే ఇక అంతే సంగతులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ..రోడ్డు భద్రత పాటిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. మద్యం, గుట్కా, నిషేధిత ఉత్ప్రేరకాల అక్రమ రవాణా నేరమన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. మద్యానికి బానిసలైతే కుటుంబాలు నాశనమవు తాయని,మద్యం సేవించి పోలీసులకు పట్టు బడితే జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని సూచించారు.