దురుద్దేశం తోనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలు..!

దురుద్దేశం తోనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలు..!
  • వాటితో పేదలకు ఒరిగేదేమీ లేదు
  • పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలి
  • వికారాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీ హామీలను మోసుకొచ్చిందని,వారంటీ లేని ఈ  ఆరు గ్యారంటీల తో పేదలకు ఒరిగేదేమీ లేదని, పేదల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకోవాలని వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోరారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండల పరిధిలోని పాత కోల్కుంద, కొత్త కోల్కుంద, అమ్రాది కుర్దు, అమ్రాది కలాన్ గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఎన్నికల మేనఫెస్టోను బీ ఆర్ ఎస్ ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందని,ముఖ్యమంత్రి  కెసిఆర్  మళ్ళీ  ప్రభుత్వంలో అధికారం లోకి వచ్చిన వెంటనే లావానీ పట్టాదారులకు పూర్తి హక్కులు కల్పించబోతున్నారన్నారు.

భూమి లేని నిరుపేద కుటుంబాలలో ఆకస్మికంగా ఎవరైనా మరణించినట్లైతే ఆ కుటుంబానికి ఆసరాగా రూ. ఐదు లక్షల ప్రమాద భీమాను మళ్ళీ వచ్చే మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతుందని అన్నారు.ఐక్యమత్యంతో పనిచేద్దాం - విజయబావుట ఎగురవేద్దామని కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు.ఎమ్మెల్యే  మెతుకు ఆనంద్ సమక్షంలో మోమిన్ పేట్ మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు గుజ్జరీ అభిషేక్ అమ్రాది కలాన్ గ్రామ కమిటీ అధ్యక్షులు యేసు, అనుచరులు 30 మంది అభిషేక్ అనుచరులు, అలాగే మోమిన్ పేట్, గోవిందాపూర్, గుడుపల్లి తండాలో బీఎస్పీ పార్టీని వీడి 150 మంది పార్టీ లో చేరారు.ఎమ్మెల్యే  వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.