వికారాబాద్ మున్సిపల్ లో జోరుగా గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

వికారాబాద్ మున్సిపల్ లో జోరుగా గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం
  • పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ మంజుల రమేష్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:- అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు శివరాం నగర్ లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ఓటర్లకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.