రేపే అంగరంగ వైభవంగా శివాజీ శోభాయాత్ర

రేపే అంగరంగ వైభవంగా శివాజీ శోభాయాత్ర
Shivaji Shobhayatra

ముద్ర,వికారాబాద్: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం వికారాబాద్ పట్టణంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇట్టి శోభాయాత్ర లో భాగంగా వికారాబాద్ లో ఊరేగింపు జరగనున్న రోడ్డు మార్గం కాషాయ జెండాలతో అలంకరించారు.

వికారాబాద్ ప్రధాన వీధుల్లో శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని హిందూ యువజన సంఘాలు తెలియజేస్తూ, హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన శివాజీ మహారాజ్ జయంతిలో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో హిందూ బంధువులు అందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.