చేవెళ్ల జర్నలిస్టు కాలనీలో  కారు బీభత్సం

చేవెళ్ల జర్నలిస్టు కాలనీలో  కారు బీభత్సం

చేవెళ్ల జర్నలిస్టు కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది.  కారు డ్రైవరుకు ఫిట్స్​ రావడంతో కారు అదుపు తప్పింది. దీంతో ఎదురుగా ఉన్న వాహనాల పైకి కారు  దూసుకెళ్లింది.  కారు ఢీకొని 20 బైకులు, రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  దీంతో భయంతో  పాదచారులు పరుగులు తీశారు.   కారు డ్రైవరుకు తీవ్ర గాయాలు కావడంతో  ఆస్పత్రికి తరలించారు.