ఓటు వేసిన వాళ్ళు గర్వపడేలా అభివృద్ధి

ఓటు వేసిన వాళ్ళు గర్వపడేలా అభివృద్ధి
  • బీఆర్ ఎస్ మహమ్మారిని తరిమికొట్టాలి
  • ఓటే మీ వజ్రాయుధం
  • అభివృద్ధి చేసే వారికి అవకాశం కల్పించాలి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:స్పష్టమైన విజన్  తో తాండూర్ అభివృద్ధి నాగరిక సమాజానికి కావలసిన అన్ని వసతుల కల్పనే లక్ష్యమని,యువత కు ఉపాధి కోసం పారిశ్రామిక హభ్ ఎర్పాటు చేస్తాననీ తాండూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యనీ మనోహర్ రెడ్డి అన్నారు.ఆశీర్వదించండి ..తాండూర్ ని నెంబర్ వన్ చేస్తా అని అన్నారు. తాండూర్ లో శుక్ర వారం ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

అందరూ గర్వపడేలా తాండూర్ నియోజకవర్గాన్ని  అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.రాబోయే ప్రమాదాలను అరికట్టే శక్తి ప్రజల చేతిలోనే ఉంది ఎవరికి వేసిన ఓటుతో లాభం జరిగిందో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు.ఎన్నికలవేళ మనోహర్ రెడ్డి  కి మద్దతుగా ముదిరాజ్ సంఘం స్వచ్ఛందంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సక్సెస్ అయింది. దీంతో తాండూర్ కాంగ్రెస్ శ్రేణుల్లో  జోష్‌ నెలకొంది. 

భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్...

కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు  చేరికల పరంపర కొనసాగుతుండగా నియోజకవర్గం లోని బి ఆర్ ఎస్ మరియు కమలం నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి వెంట  యూత్ నడుస్తుండగా సకల జనులు సైతం హస్తం గుర్తుకు మద్దతుగా కదిలి వస్తున్నారు. తాండూర్ లో ఈరోజు ముదిరాజ్ సోదరులు తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనంకి ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు అనే  ఆయుధం తో రాబోయే ప్రమాదాలను అరికట్టే శక్తి ప్రజల చేతిలోనే ఉందన్నారు.ఎవరికి వేసిన ఓటుతో లాభం జరిగిందో  ప్రజలు ఆలోచించాలి అని కోరారు. బి ఆర్ ఎస్ మహమ్మారిని తరిమికొట్టాలి అన్నారు.నాగరిక సమాజానికి కావలసిన అన్ని వసతుల కల్పనే లక్ష్యం గా పాలన చేస్తానని అని అన్నారు.  ఆశీర్వదిస్తే  పదివేల మంది యువతీ యువకులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక హభ్ ఎర్పాటు చేస్తానని అన్నారు. తాండూర్ నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ చేస్తా  అని పేర్కొన్నారు.