తాండూరు పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి బియ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తాండూరు పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి బియ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
  • ఇందిరా నగర్ లోని రామ మందిరం మరియు గుండు పీర్లు దర్గాలో ప్రత్యేక పూజలు.
  • పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బర్త్ డే కేక్ కట్ చేసిన మనోహర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి బుధవారం ఉదయం నుంచి తాండూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.  ఇందిరా నగర్ లోని రామ మందిరం, గుండు పీర్లు దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  జన్మ దినం సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందిరానగర్ రామ్ మందిర్ మల్ రెడ్డి పల్లి రోడ్డు శివాజీ చౌక్ , వీ వీ హెచ్ ఎస్ రోడ్ ,తాండూర్ గంజ్ మర్రి చెట్టు కూడలి,  గాంధీ చౌక్, ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ల మీదగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాండూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని
తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.