ముదిరాజుల వ్యతిరేకత వల్లే  బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోనుంది - శంకర్ ముదిరాజ్

ముదిరాజుల వ్యతిరేకత వల్లే  బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోనుంది - శంకర్ ముదిరాజ్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: బానిసలు కాకండి ,రాజకీయ పార్టీలకు తొత్తులు కాకండి అని ముదిరాజ్ సంఘం  రాష్ట్ర  అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ లు పిలుపు నిచ్చారు. శని వారం తాండూర్ లో జరిగిన ముదిరాజ్ లు రాజ్యాధికారానికి రావాలి అనే ఆశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  మాట్లాడుతూ నేడు ముదిరాజ్ బిడ్డల ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో నే బీఆర్ఎస్ ప్రభుత్వము కూలి పోతుందని అన్నారు.

మనం ఓట్లు వేసిన వారే నాయకులుగా ఎదుగుతున్నారు. 60 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలే ఉన్నా కాంగ్రెస్స్, బీ ఆర్ ఎస్, బీజేపీ  పార్టీలు ముదిరాజు లకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం లేదు. నీ జాతి పౌరుషం చూపించి జాతి జాగృతి కోసం మీ ఓట్లు మీరు వేసుకుంటే మనవారే రాజ్యాధికారం లో ముదిరాజు లు భాగస్వాములం అవుతామని అన్నారు. మనం ఓట్లు అమ్ముకోవద్దని కోరారు. గ్రామ గ్రామానికి ముదిరాజ్ సంఘం విస్తరించింది. తెలంగాణా ప్రభుత్వం  తెలంగాణ 60 లక్షల ముదిరాజ్ ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కొంతమంది నాయకులు ముదిరాజ్ నాయకులు పోటీ చేసే చోట్ల ఓడించేందుకు కుటిల రాజకీయాలను చేస్తున్నారు.  తాండూర్ లో ముదిరాజ్ ల ఐక్యతకు, ఆత్మ గౌరవం కోసం పోటీ చేస్తున్న ముదిరాజ్ బిడ్డ, బీ ఎస్ పీ అభ్యర్థి చెంద్రశేఖర్ ను గెలిపించుకుందామని చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ముదిరాజు బిడ్డలు ఎక్కడ నిలబడినా వారిని గెలిపించుకుందామని అన్నారు.

 రాష్ట్రంలో లక్షా 70 వేల ఓట్లు ఎస్సీ ఎస్టీలకు, బీసీ లకు చెందిన ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే తాండూర్ నియోజకవర్గం లో 60 వేల ఓట్లు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు, సామాజికవేత్త లు ముదిరాజు ల ఐక్యతకు పోరాడుతుంటే కొందరు దగాకోరు నాయకులు ముదిరాజు ల్లోనే  విభేదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. తాండూర్ లో ముదిరాజు ల ఆత్మ గౌరవం నిలబెట్టుకునేందుకు ముదిరాజ్ బిడ్డ చెంద్రశేకర్ ను  గెలిపించాలని అన్నారు. తాండూర్ గడ్డ ముదిరాజ్ ల అడ్డ అని అన్నారు. ఏడు సార్లు తాండూర్ లో ముదిరాజ్ బిడ్డలే గెలిచారని అన్నారు.

ఈ కార్యక్రమంలో  ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, నాయకులు సంజీవ్, బ్రహ్మం, సురేష్, జగన్. తదితులున్నారు.