కులవృత్తుల వారిని ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది - పైలెట్ రోహిత్ రెడ్డి

కులవృత్తుల వారిని ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది - పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూరు నియోజకవర్గంలోని మహీంద్రా (మేదరి) సంఘం నాయకులు, ప్రతినిధులు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో  బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు  అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, రైతుబంధు,  రైతు బీమా వంటి అనేక రకాల  పథకాలను దేశంలో ఎక్కడలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందిస్తుందని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో  రూ.1680  నిధులను తాండూరు కు తెచ్చిన ఘనత  మీ బిడ్డ రోహిత్ రెడ్డి అని తెలిపారు.  ఎమ్మెల్యే గెలిచి ఇచ్చిన హామీల ప్రకారం తాండూరు రూపు రేఖలు మర్చి చూపించానని వెల్లడించారు. ముఖ్యంగా  పట్టణంలోని కొత్త కాలనీలకు సిసి రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించాలని తెలిపారు.

ఈ ఎన్నికల్లో  సంఘం సభ్యులు పూర్తి మద్దతు ఇచ్చి తిరిగి ఎమ్మెల్యే గా తనను గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమానికి ముఖ్యంగా నిమ్న వర్గాల వారికి, కుల వృత్తి చేసుకునే వారికి సీఎం కేసీఆర్ అనేక విధాలు ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.