గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి - మెతుకు ఆనంద్

గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి - మెతుకు ఆనంద్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి ప్రతి తండాకు రూ. 50 లక్షలు చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు ముమ్మరంగా చేయించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శని వారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్ద తండా, నర్సాపూర్ చిన్న తండాలో ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తండాలను మనమే పాలించుకునే పాలన సౌలభ్యం కల్పించిన కెసిఆర్ సార్ ని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం. కారు గుర్తుకు ఓటెయ్యండి భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరారు.

ఇదే సంద్భంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు.