గిరిజనుల గోస తీర్చిన ఘనత కేసీఆర్‌  దే

గిరిజనుల గోస తీర్చిన ఘనత కేసీఆర్‌  దే
  • ప్రత్యేక గ్రామ పంచాయతీలతో తండాలకు మహర్దశ
  • గిరిజనులను ఓటు బ్యాంక్‌గానే చూసిన బీజేపీ, కాంగ్రెస్‌లు
  • నియోజకవర్గ అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తున్న జగదీష్ రెడ్డి కి మద్దతుగా ఏకమైన రేఖ్యా నాయక్ తండా వాసులు 


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా తండాలకు తండాలు ఏకగ్రీవమవుతున్నాయి. తాజాగా సూర్యాపేట రూరల్ మండలం రేఖ్యానాయక్ తండా వాసులు మా భ్రతుకులను బాగు చేసిన జగదీషన్న తోనే మా పయనం అంటూ ఏకగ్రవంగా తీర్మానించారు. గ్రామస్తుల కోరిక మేరకు తండా కు వెళ్లిన మంత్రి కి తండావాసులు మంగళ హారతులతో స్వాగతం పలికారు.

తండాలోని చిన్నారులను, ప్రతీ ఒక్కరినీ పలకరించిన మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ,కాంగ్రెస్‌, బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూసాయి తప్పా, వారి బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు ఆత్మగౌరవాన్ని కల్పించిర్ వారి గోస తీర్చారన్నారు.గిరిజన గ్రామాల్లో స్వయం పాలనను అందించిన గొప్ప మనసున్న నేత సీఎం కేసీఆర్‌ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గిరిజన తండాల్లో రోడ్లు, మంచి నీటి వసతులను కల్పించడంతోపాటు పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మించామన్నారు.బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అన్నారు. తనను తండా కు పిలిచి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన తండా వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.