గత ఐదేళ్లలో నేను అన్ని విధాలుగా అండగా ఉన్నాను..

గత ఐదేళ్లలో నేను అన్ని విధాలుగా అండగా ఉన్నాను..
  • మీ ధైర్యం.. మద్దతుతోనే క్రితం ఎన్నికలలో  గెలిచాను .
  • తాండూర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మరో సారి అండగా నిలవాలి .
  • క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూరు ప్రాంతంలోని క్రైస్తవ సోదరులతో నాకు దగ్గరి బంధం ఉందనీ, వారి సంక్షేమానికి కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారము రాత్రి తాండూర్ లో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతు నాకంటే ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా క్రైస్తవులకు ఇంత దగ్గరగా లేరు అని నేను అనుకుంటా అని అన్నారు. తాండూరు క్రైస్తవు సోదరులకు గత ఐదేళ్లలో నేను అన్ని విధాలుగా అండగా ఉన్నాను. మీ ధైర్యం.. మద్దతుతోనే క్రితం ఎన్నికలలో నేను గెలిచానని గర్వంగా..గట్టిగా చెప్పడానికి భయపడను. తాండూరులో ఎవరు కూడా ప్రీక్రిస్మస్ వేడుకలను నిర్వహించలేదు. కేవలం పైలెట్ రోహిత్ రెడ్డి మాత్రమే ధైర్యంగా ప్రీక్రిస్మస్ వేడుకలను నిర్వహించాడు.
ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా నేను ఈ సాంప్రదాయంను కొనసాగిస్తున్నాను. తాండూరులో గత 50 ఏళ్లుగా ఎవరూ సాధించనిది నేను క్రిష్టియన్ భవన్ ను తీసుకవచ్చాను. క్రిష్టియన్ భవన్ నిర్మాణంకు రూ.50 లక్షలు మంజూరు అయ్యాయి. మరో రూ.50 లక్షలు విడుదల చేస్తాను. వచ్చే ఏడాది ప్రీ క్రిస్మస్ వేడుకలను క్రిష్టియన్ భవన్ లో జరుపుకుందాం అని అన్నారు. అప్పటిలోగా క్రిష్టియన్ భవన్ నిర్మాణంను పూర్తి చేస్తాను. రాజకీయ రంగంలో కూడా నా వెంట ఉన్న క్రిష్టియన్ నేతలను ప్రోత్సహించాను. మునిసిపాలిటీలో నాకు కేటాయించిన కోఆప్షన్ పోస్ట్ ను క్రిష్టియన్ కు కేటాయించాను.

నా వెంట ఉండే విజయ్..డేవిడ్..హేమంత్ లాంటి వారికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తును కల్పిస్తాను. ఎన్నికలు వచ్చాయి..నా తాండూరు క్రైస్తవ సోదరులు మరోసారి నాకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మీ ఆశీర్వాదం..మీ ప్రార్థనలు నాతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. మీకు ఏకష్టం వచ్చినా అండగా ఉన్నాను..ఇక ముందు కూడా ఉంటాను అని అన్నారు. తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని చూడండి.
ఈ అభివృద్ధి కొనసాగాలంటే..మరింతగా తాండూరు అభివృద్ధి చెందాలంటే మీరంతా నాకు అండగా ఉండాలి. తాండూరు అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను నా తాండూరు క్రైస్తవ సోదరులు అడ్డుకోవాలని కోరారు. నేను తాండూరు బిడ్డను..మీ బిడ్డను తాండూరుపై ప్రేమ ఉంది..అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉందనీ అన్నారు. కావున మరోసారి నా తాండూరు క్రైస్తవ సోదరులకు విజ్ఞప్తి..
నవంబర్ 30న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.