కేటీఆర్ కు నిరసన సెగ

కేటీఆర్ కు నిరసన సెగ

కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేపీ నేతలు 

జడ్చర్ల, ముద్ర: మంత్రి కేటీఆర్ కు జడ్చర్లలో నిరసన సెగ తగిలింది. ఎర్రగుట్ట వద్ద నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం ఆయన గురువారం జడ్చర్లకు వచ్చారు. ఏబీవీపీ, బీజేపీ, బీజేవైఎం నాయకులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకొని నిరసన తెలిపారు. స్థానిక పోలీసులు అప్రమత్తమమై వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఏబీవీపీ , బీజేపీ నాయకులు పథకం ప్రకారం నిరసనకు దిగడం పట్ల మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన ఎర్రగడ్డ వద్ద నిర్మించిన 560 ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. మంత్రి వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు