పైలెట్ రోహిత్ రెడ్డినీ భారీ మెజార్టీతో గెలిపిద్దాం - ఆర్తి రెడ్డి

పైలెట్ రోహిత్ రెడ్డినీ భారీ మెజార్టీతో గెలిపిద్దాం - ఆర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూరు పట్టణం  ఎన్టీఆర్ కాలనీలో గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ని గెలిపించాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి కోరారు.

ఈ సందర్భంగా వార్డు మహిళలు మంగళహారలతో  ఆర్తిరెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించమని ఆర్తిరెడ్డి  కోరారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బిజెపి పార్టీలు చేసే మోసపూరితమైన మాటలను మరియు అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. ఆర్తి రెడ్డి  వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు , తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ శ్రీనివాస్ చారి గారు, మహిళ అధ్యక్షురాలు సంగీత ఠాగూర్ , వార్డ్ ఇంచార్జ్ ఇర్షాద్, మహిళా నాయకులు అనిత రమేష్, నిర్మల మరియు వార్డు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.