బీఅర్ఎస్ పార్టీ హయాంలోనే అద్భుత ప్రగతి - జెడ్పీటీసీ ప్రమొదిని

బీఅర్ఎస్ పార్టీ హయాంలోనే అద్భుత ప్రగతి - జెడ్పీటీసీ ప్రమొదిని

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: యాలాల మండలం దేవనూరు గ్రామపంచాయతీ లోని దుబ్బల తండా, దేవుల తండాలో జడ్పిటిసి సిద్రాల సంధ్యారాణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అషన్న, సర్పంచ్ శివా తో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం  నిర్వహించారు. తండాలో  ఇంటింటి కి తిరిగి బీ అర్ ఎస్ మానిఫెస్టో వివరించారు. తండాలను గ్రామపంచాయతీగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దేనని రాబోయే కాలంలో తండాలం అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. కేసిఆర్ ప్రారంభించిన రైతుబంధు, రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను రాబోయే కాలంలో మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొకసారి తాండూరు ముద్దుబిడ్డ ను అసెంబ్లీకి పంపడానికి మనందరం కృషిచేసి గెలిపించుకోవాలని వారు అన్నారు.