స్మశాన వాటిక లేక నరకయాతన

స్మశాన వాటిక లేక నరకయాతన
  • అధికారులకు మొరపెట్టుకున్నా తీరని సమస్య
  • 14ఏళ్లుగా అంతులేని వ్యథను మిగిల్చుతున్న అంతిమయాత్ర
  • వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీ వాసుల బాధ వర్ణనాతీతం 

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: మనిషి జీవిత గమనంలో చివరి మజిలీ అంతిమయాత్ర. బ్రతికి ఉన్నన్నాళ్లు ఎన్నో కష్టాలకు, నష్టాలకు దుఃఖాలకు లోనయి అలసిపోయిన దేహం చివరకు స్మశాన వాటికకు చేరుకుంటుంది మరి ఆ స్మశాన వాటిక లేకపోతే ఏం చేయాలి. అలాంటి పరిస్థితి తోనే వికారాబాద్ లోని రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ కాలనీలో సుమారు 7వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. అయితే అనేక మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య తీరలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్లుగా ఈ బాధ అనుభవిస్తున్నామని కాలనీ లో ఎవరైనా అకాల మరణం చెందితే ఖననం ఎక్కడ చేయాలో అంతుచిక్కని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజీవ్ గృహకల్ప కు స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ మురళి కోరుతున్నారు.