బిసీ, బడుగుల రాజ్యాధికారమే నా ధ్యేయం

బిసీ, బడుగుల రాజ్యాధికారమే నా ధ్యేయం
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ ముదిరాజ్​
  • పరిగిలో ఘనంగా పండుగల సాయన్న విగ్రహ ఆవిష్కరణ
  • హాజరైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్​, కాసాని వీరేష్​, బిత్తిరి సత్తి

పరిగి, ముద్ర న్యూస్: పరిగి పెత్తందార్ల  గుండెల్లో ఆనాడే రైళ్లు పరిగెత్తించానన వాళ్ల వెన్నులో వణుకు పుట్టించానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముదిరాజ్​ ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో ఆదివారం పండగల సాయన్న, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్​ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పరిగి–హైదరాబాద్​ బీజాపూర్​ హైవే రోడ్డు పక్కన వేలాధి మంది ముదిరాజ్​ మద్య  కాసాని జ్ఞానేశ్వర్​ ముదిరాజ్​ జెండాను, పండగల సాయన్న, క్రిష్ణ స్వామి ముదిరాజ్​ విగ్రహాలను ఆవిష్కరించారు.  ఈ ఆవిష్కరణ కంటే ముందుగా బిత్తిరి సత్తి తనదైన శైలిలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్​ మాట్లాడుతూ ముదిరాజ్​ కులస్తులంతా ఇలా ఏకమై పండుగల సాయన్న విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

అనంతరం టీడీపీ రాష్ట అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాసాని వీరేష్​ బాబు ముదిరాజ్​ తో కలిసి అక్కడి నుంచి వేలాధి మందితో భారీ ర్యాలీగా శారదా గార్డెన్స్​ కు చేరుకున్నారు. సభా వేధికపై కళాకారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్​ మాట్లాడుతూ  ముదిరాజ్​ కులస్తులతోపాటు బీసీ, బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ఆనాడు పెత్తందారులు, దొరల గుండెల్లోరైళ్లు పరగిగెత్తించానన్నారు. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదని ముదిరాజ్​ కులస్తులు అంతా ఏకమై బీసీ,బడుగు, బలహీన వర్గాలతోకలుపుకొని పోయి పెత్తందారులకు చెర నుంచి రాజ్యాధికారాన్ని లాగేసుకుందామని  పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, బడుగు, బలహీన వర్గాల వారికే టికెట్లు కేటాయిస్తానని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా పార్టీలో చేరితే అవకాశం ఇస్తామంటూ సూచించారు. 


అనంతరం కాసాని వీరేష్​ మాట్లాడుతూ టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ ముదిరాజ్​ ఆనాటి నుంచి కళలు కంటున్న రాజ్యాధికారం కోసం మనమంతా ఏకం కావాల్సిన​ అసరం ఎంతైనా ఉందన్నారు. ఆ అవకాశం త్వరలో మన ముందుకు రాబోతుందన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మన ముదిరాజ్​ బిడ్డలతోపాటు, బీసీ బడుగు, బలహీన వర్గాల వారికే ఓటు వేసి మనల్ని మనం గెలిపించుకోవాలంటూ పిలుపునిచ్చారు.  మాజీ మంత్రి ఈటెల రాజేందర్​ మాట్లాడుతూ ముదిరాజ్​ కులస్తులంతా ఐక్యమై పోరాడి రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్నారు. మున్సిపల్​ చైర్మన్​ ముకుంద అశోక్​ కుమార్​ మాట్లాడుతూ పార్టీలను పక్కన బెట్టి ముదిరాజ్​ ఐక్యతకు కృషి చేయాలన్నారు. పరిగి గడ్డపై మున్సిపల్​ చరిత్రలో తొలి చైర్మన గా నాకు అవకాశం రావడం ముదిరాజ్​ బిడ్డగా గర్విస్తున్నానన్నారు. బిత్తిరి సత్తి మాట్లాడుతూ  పరిగి గడ్డపై ముదిరాజు రాజ్యాధికారానికిపై మనమంతా పనిచేయాలన్నారు. టీడీపీ పార్టీ నుంచి కాసాని వీరేశ్​ ని పరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచెంద్రయ్య, డాక్టర్​ జగన్మోహన్​, హన్మంతు ముదిరాజ్​, శాంతిబాయి, బీఎస్​ ఆంజనేయులు ముదిరాజ్​, నాగేశ్వర్​, మాణిక్యం, పర్శమోని బాబయ్య,మధుసూదన్​ ముదిరాజ్​, శ్రీశైలం, రవి తదితరులు పాల్గొన్నారు. పండగల సాయన్న కుటుంబీకులు, పండగ సాయన్న చరిత్రను తెలిపిన వారికి శాలువా పూజలమాలలతో ఘనంగా సత్కరించారు