పైలెట్ సతీమణి ఆర్తి రెడ్డి ముమ్మర ప్రచారం 

పైలెట్ సతీమణి ఆర్తి రెడ్డి ముమ్మర ప్రచారం 

రోహిత్ రెడ్డినీ భారీ మెజార్టీ తో గెలిపించాలని గడప గడపకు వెళ్లి  ప్రచారం 

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సతీమణి తన భర్త గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాండూరు పట్టణంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి అన్ని వర్గాల ప్రజల ను కలిసి రోహిత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని . ఆయా వార్డులలో గడప గడపకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు.. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నీ ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభా రాణి, కౌన్సిలర్ సంగీత ఠాకుర్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమలళా, అనిత నాయకులు రాజన్ గౌడ్, కృష్ణ, సిరి యాదవ్, అనంత రెడ్డి, రమేష్, వెంకట్ సుబ్బయ్య తదితరుల ఉన్నారు.