అభివృద్ధి పార్టీలోకి వలసలు.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. కాంగ్రెస్ నుండి బీ ఆర్ ఎస్ లో చేరిన యువకులు

అభివృద్ధి పార్టీలోకి వలసలు.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. కాంగ్రెస్ నుండి బీ ఆర్ ఎస్ లో చేరిన యువకులు

మెట్‌పల్లి ముద్ర: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పలు పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీ ఆర్ ఎస్ లో చేరుతున్నారని. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ పట్టణ అధ్యక్షుడు బర్ల అర్జున్ ఆధ్వర్యంలో యువకులు,మైనారిటీ నాయకులు బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్.కల్వకుంట్ల సంజయ్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోరుట్ల లో గెలిచేది సంజయ్, ఎగిరేది బీ ఆర్ ఎస్ జెండా అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ ఖుతుబోద్దిన్ పాషా, లింగంపెళ్ళి  సంజీవ్, బర్ల రమేష్, మహ్మద్ సమీర్, నల్ల మహేష్, తాళ్లపెళ్లి సుమన్, జెట్టి మారుతి, బర్ల శివ ప్రసాద్, బర్ల రాజు, బర్ల రాజేందర్, బర్ల అక్షయ్,బర్ల ప్రశాంత్, బాద సునీల్, దివిటీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.