అనుమానం.. పెనుభూతం..చివరికి ఇలా..!!

అనుమానం.. పెనుభూతం..చివరికి ఇలా..!!
Beerelli village crime news

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: కోట్ పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నవాబు పేట్ మండల కేంద్రంలోని ఓ వ్యక్తికి చెందిన 9 ఎకరాల భూమిని కౌలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యపై భర్తకు అనుమానం ఉండడంతో పొలం దగ్గర కొడవలితో కడుపు భాగంలో, వెనకాల పొడిచాడు.

పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకుని ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.భార్యను పొడిచిన భర్తను  పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.