భట్టి పాదయాత్ర

భట్టి పాదయాత్ర
  • 700 కిలోమీటర్లు పూర్తయినందుకు మొక్కలు నాటిన భట్టి
  • భట్టి పాదయాత్రలో కర్ణాటక గెలుపు పై సంబురాలు
  • పాదయాత్ర శిబిరంలో కేక్ కట్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • చేవెళ్ల నుంచి షాద్ నగర్ లోకి అడుగుపెట్టిన పాదయాత్ర
  • షాద్ నగర్ లో భట్టి పాదయాత్రకు గ్రాండ్ వెల్కమ్

ముద్ర, షాద్‌నగర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 58వ రోజు శనివారం చేవెళ్ల నుంచి షాద్‌నగర్  నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. షాబాద్- రేగడి చిలకమర్రి శివారులో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క సమక్షంలో రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి,  భీమ్ భారత్, సున్నపు వసంతం, చంద్రశేఖర్ యాదవ్ తదితర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణా సంచ కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి భట్టి విక్రమార్కకు మిఠాయి తినిపించి అభినందనలు చెప్పారు. అనంతరం పిసిసి జనరల్ సెక్రెటరీ రాపోలు జయప్రకాష్ తీసుకు వచ్చిన కేకును భట్టి విక్రమార్క కట్ చేశారు. 

700 కిలోమీటర్లు పూర్తయినందుకు మొక్కలు నాటిన భట్టి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం నాటికి 700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఉదయం బస చేసిన గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయలుదేరేముందు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మొక్కను నాటారు. షాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మార్గమధ్యంలో ఉన్న పహిల్వాన్ చెరువును పరిశీలించారు. 

షాద్ నగర్ లో ఘనస్వాగతం

58వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర షాద్నగర్ నియోజకవర్గం కొందురుగు మండలం రేగడి చిలకమర్రి గ్రామంలోకి అడుగు పెట్టడంతో పిసిసి జనరల్ సెక్రెటరీ పీర్లపల్లి శంకర్ డిసిసి ఉపాధ్యక్షులు జితేందర్ రెడ్డి మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి యూత్ కాంగ్రెస్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు పురుషోత్తమ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. పూలమాల శాలువా వేసి ఘనంగా సత్కారం చేయడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బట్టి విక్రమార్కకు మిఠాయి తినిపించి సంబరాలు జరిపారు.