నేడు రాష్ట్ర చిహ్నం, గీతం పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

నేడు రాష్ట్ర చిహ్నం, గీతం పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

ముద్ర,తెలంగాణ:-  తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు, గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. దింతో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రెండింటినీ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఈరోజు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశం అవుతారు సీఎం రేవంత్. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్‌కు ఆహ్వానం పంపలేదు.ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై సర్కార్ స్పీడ్ పెంచింది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.