ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మల్లారెడ్డి, షర్మిల

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మల్లారెడ్డి, షర్మిల
  • మంత్రికి విజనరీ మ్యన్ అవార్డ్
  • పాదయాత్రతో రికార్డు సృష్టించిన వైఎస్​తనయ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విజనరీ మ్యాన్ అవార్డును దక్కించుకోగా.. వైఎస్సార్ టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల అత్యధిక దూరం పాదయాత్ర చేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 

  • ‘పాలమ్మిన..  పూలమ్మిన’ అంటూ మినిస్టర్​వ్యాఖ్యలు

తనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించడంపై మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడితే ఎంతటి విజయాన్నయినా చేజిక్కించుకోవచ్చని తెలిపారు. తన విజయానికి ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తన ఫేమస్ డైలాగ్.. ‘పాలు అమ్మి,.. పూలు అమ్మిన.. అంటూ మళ్లీ రిపీట్ చేశారు. కాలేజీలు స్థాపించి ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేస్తున్నందుకు తనకెంతో గర్వంగా ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే తనకు అన్ని  సంపదలు చేకూరాయని తెలిపారు. ఇక తన జీవితాన్ని ప్రజా శ్రేయస్సు కోసమే కేటాయిస్తానని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో వై.ఎస్. షర్మిల 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన మొదటి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు షర్మిలను కలిసి అభినందించి అవార్డును అందజేశారు.