భూ నిర్వాసితులకు అండగా  రాష్ట్ర ప్రభుత్వం

భూ నిర్వాసితులకు అండగా  రాష్ట్ర ప్రభుత్వం
State Govt support to land dwellers says MLA Payla Sekhar Reddy
  • బీఎన్ తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాం
  •  నృసింహ రిజర్వాయర్ తో సస్యశ్యామలం
  • లే అవుట్ అభివృద్ధికి నిధులు విడుదల  అన్ని సౌకర్యాలతో లే అవుట్ 
  • లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 

భువనగిరి(ముద్ర న్యూస్):  బీఎన్ తిమ్మాపూర్ గ్రామ ప్రజల త్యాగాలు ఎన్నటికీ మర్చిపోలేనివాని, వారి త్యాగలతోనే నృ సింహా రిజర్వాయర్ ఏర్పాటుతో భువనగిరి, ఆలేరు ప్రాతం సస్యశ్యామలం అవుతుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. నృసింహ రిజర్వాయర్ లో ముంపుకు గురవుతున్న ఇండ్ల యజమానులకు లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాలను బుధవారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్  ప్రమేల సత్పతి, డిప్యూటీ కలెక్టర్ భూపాల్ రెడ్డి,పర్యవేక్షణలో లబ్ధిదారులకు కేటాయించారు.  

బీఎన్ తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం రిజర్వాయర్లో ముంపుకు గురైన బియ్యం తిమ్మాపూర్ గ్రామస్తులందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారని అందుకు అనుగుణంగానే చక్కటి కాలనీని అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ  ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంకా పరిహారం రానివారికి త్వరలోనే పూర్తిగా అందించేందుకు కృషి చేస్తానన్నారు.

 బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితుల పునరావాసం క్రింద అందిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ సర్వే నెం. 107 లో  విద్యుత్, నీటి వసతుల ఏర్పాట్లు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామ నిర్వాసితులకు గతంలో 655 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ  7 లక్షల 61 వేల రూపాయల చొప్పున మొత్తం 50 కోట్లు ఇవ్వడం జరిగిందని, మిగిలిన 401 మందికి  లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుందన్నారు.   1055 మందికి పునరావాసం క్రింద హుస్నాబాదు గ్రామంలోని సర్వే నెం. 107 లో ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను  లాటరీ విధానం  ద్వారా కేటాయించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, ఎమ్మార్వో వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, జెడ్పిటిసి బీరు మల్లయ్య, సింగిల్ బిందు చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.