నేడు కిషన్​రెడ్డి  అమెరికా పర్యటన

నేడు కిషన్​రెడ్డి  అమెరికా పర్యటన
  • ప్రపంచ పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రసంగం

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్ర్కృతికశాఖ మంత్రి జి.కిషన్​రెడ్డి గురువారం అమెరికా వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ప్రపంచ పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కేంద్ర మంత్రిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది. ఇది కిషన్​రెడ్డికి దక్కిన అరుదైన అవకాశం. దాదాపు వారం రోజుల పాటు ఆయన అమెరికాలో ఉండనున్నారు. ఈనెల 18వ తేదీన భారత్​కు చేరుకోనున్నారు. బుధవారం రాత్రికి ఆయన ఢిల్లీకి చేరుకోనుండగా, అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు.