తులం బంగారం రూ.60 వేలు

తులం బంగారం రూ.60 వేలు
  • భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. నెలరోజులుగా ఒకే ధరతో కొనసాగిన బంగారం, వెండి ధరలు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలకు చేరుకుంది. ముందురోజుతో పోలిస్తే రూ.380 పెరిగిందని, ఇది ఆల్ టైమ్ రికార్డు అని నిపుణులు తెలిపారు. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలు కాగా, 22 క్యారెట్ల ధర రూ.55 వేలుగా ఉంది. డాలర్ ధర పడిపోవడంతో బంగారం ధర పెరిగిందని నిపుణులు తెలిపారు.