ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరానికి పోటెత్తిన యువకులు

కిటకిటలాడిన మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరానికి యువకులు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుండి యువకులు వందలాదిగా క్యాంపు కార్యాలయానికి తరలిరావడంతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సౌజన్యంతో ఈ శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ఆత్మ చైర్మన్ అంజాగౌడ్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ జయరాజు, కిషోర్,  కోఆప్షన్ సభ్యులు ఒమర్, జుబేర్ లు కౌంటర్ల వద్ద ఉండి రిజిస్ట్రేషన్ చేయించారు.  నియోజకవర్గంలో 18 ఏళ్ల వయసు పైబడి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతి, యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా 
2,3,4 వీలర్ లైసెన్స్ లను  తన సొంత నిధులతో అందించనున్నట్లు  మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి లైసెన్స్ అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు.