2వ రోజుకు చేరిన సెర్ఫ్ విఓఎల నిరవధిక సమ్మె

2వ రోజుకు చేరిన సెర్ఫ్ విఓఎల నిరవధిక సమ్మె

ముద్ర ప్రతినిధి, మెదక్: విఓఎలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరుకుంది. మెదక్ కలెక్టరేట్ ముందు టెంట్ వేసి సమ్మె శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 518 మంది  సిఎలుగా పనిచేస్తున్నారు. సెర్ప్ హెచ్ఆర్ ఇవ్వాలని, విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రస్తుతం ఇస్తున్న  3.900నుండి 18,000కు పెంచాలని కోరారు. వేతనాలు  వ్యక్తిగత ఖాతలకు నేరుగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికి సెర్ప్ నుండి ఐ.డి కార్డు ఇవ్వాలన్నారు. విఓఎలకు సాధారణ బీమా, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. గ్రేడింగ్ విధానం రద్దు చేయాలన్నారు. ఈ సమ్మెలో అధ్యక్షులు సాయగౌడ్, కార్యదర్శి స్వరూపారాణి, కోశాధికారి కవిత, ఉపాధ్యక్షులు అశోక్ యాదవ్, స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు వెంకట్, కార్యవర్గ సభ్యులు దశరథ్, అశోక్, శ్రీశైలం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.