పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  మనోహర్ రెడ్డి

పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  మనోహర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూర్ పట్టణంలో ని బాలాజీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్  వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శని వారం నిర్వహించిన ఉద్యోగ కార్మిక సంఘాల సన్నాహక సమావేశానికి తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి , డాక్టర్ సంపత్ తదితరులు హాజయ్యారు. ఈ సంద్భంగా బుయ్యని మనోహర్ రెడ్డి గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ
గ్రామ పంచాయితీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవే అని అన్నారు.

గ్రామ పంచాయితీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని అలాగే పి ఆర్ సి పరిదిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుక రావాలని, పంచాయితీ లలో ఆధాయమున్న చోట  వేతనాలు పెంచాలని,పంచాయితీ సిబ్బందికి రిటైర్మెంట్ బెన్ఫిట్ అమలు చేయాలని,జీఓ నెంబర్ 51 ని సవరించాలని అనే డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని అని అన్నారు.