ఎన్నికల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి : కలెక్టర్

ఎన్నికల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి : కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా  సాధారణ పరిశీలకులు  సమక్షంలో సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ శనివారం యెన్.ఐ. సి. సమావేశ మందిరంలో సాధారణ పరిశిలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయియో, జగదీశ్ పర్యవేక్షణలో జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్   పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.  జిల్లాలోని మూడు నియోజక వర్గాలతో పాటు బాన్సువాడలో కొన్ని సమస్యాత్మక   పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు 126 మంది మైక్రో అబ్జర్వర్లు అవసరం కాగా 29 శాతం అధికంగా ర్యాండమైజేషన్ ద్వారా 164 మందిని ఎంపిక చేసి ఆయా నియోజక వర్గాలకు కేటాయించారు. అట్టి ఉత్తర్వులను  సంబంధిత  రిటర్నింగ్ అధికారుల ద్వారా అందజేస్తూ ఈ నెల 25 న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పరిశీలకుల ద్వారా   శిక్షణ ఇవ్వనున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు లేదా అంతకు మించి పోలింగ్ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉన్న 126 లొకేషన్స్ క్లోని 285  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో  ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చెక్ లిస్ట్ ప్రకారం మాక్ పోలింగ్,  ఏర్పాట్లు,  తదితర కార్యక్రమాలను సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు  రాజారామ్, రఘునాథ్, శ్రీకాంత్ తదితరులు  పాల్గొన్నారు. ఫిర్యాదు చేయండి కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల  ఎన్నికల అంశాలకు సంబంధించి ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయియో కు ఫిర్యాదు చేయవచ్చని జిల ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశిలకులు అన్ని పనిదినాలలో ఉదయం పదిన్నర నుండి మధ్యాన్నం 12. 30 వరకు కలెక్టరేట్ లోని 102 గదిలో అందుబాటులో ఉంటారని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు  పరిశిలకులను నేరుగా కలవవచ్చని  ఆయన తెలిపారు. లేదా వారి ఫోన్ నెంబరుకు  6304108748 కు,  లేదా ఏ మెయిల్  generalobserverkmrac@gmail;.com  కు ఫిర్యాదు చేయవచ్చని  కలెక్టర్ తెలిపారు.