కామారెడ్డిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుటుంబ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకించేందుకు అందరూ భాగస్వామ్యలు కావాలని  ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్  కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్, కాలకుంట్ల రాము జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రెడ్డి,  మోహన్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, శ్రవణ్, నవీన్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.