కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన అసెంబ్లీ స్పీకర్ పోచారం, కలెక్టర్ పాటిల్

కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన అసెంబ్లీ స్పీకర్ పోచారం, కలెక్టర్ పాటిల్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేయడానికి ప్రజలు బారులు తీరారు. పట్టణాల్లో మందకొడిగా పోలింగ్ జరుగుతోంది.   

అసెంబ్లీ స్పీకర్ , బాన్సువాడ బిఆరెస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం బాన్సువాడ  మండలం పోచారం గ్రామంలో సతీమణి పుష్పతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా స్వామ్యం లో ఓటు ఎంతో విలువైనదని, సరైన నాయకుడిని, పార్టీని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి పథంలోకి పాయనిస్తుందని అన్నారు.  భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకుని ఓటును వేసి రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి లో ఆదర్శంగా నిలవాలని అన్నారు.   కామారెడ్డిలో కలెక్టర్ జితేష్. వి పాటిల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.