కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

జిల్లాలో    71.07 శాతం పోలింగ్.
కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
జిల్లాలో    71.07 శాతం పోలింగ్. 
-ఓటు వేసిన అసెంబ్లీ స్పీకర్ పోచారం, కలెక్టర్ పాటిల్, షబ్బీర్ అలీ, కాటిపల్లి
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రేవంత్ రెడ్డి
చెదురుముదురు ఘటనలు  మినహా ప్రశాంతం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జాక్5 నియోజకవర్గాల్లో గురువారం నాడు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.  ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేయడానికి ప్రజలు బారులు తీరారు. పట్టణాల్లోను జోరుగా పోలింగ్ సాగింది. మధ్యాహ్నం మందకొడిగా పోలింగ్ జరుగగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగింది. సిఎం కెసిఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బిజెపి అభ్యర్థి కేవీ ఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి లో ఉత్కంఠ భరితంగా పోలింగ్ సాగింది. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మున్సిపల్ బూత్ లో ఉండడంతో బిఆరెస్ నాయకులు నిలదీసి వాగ్వాదం కు దిగారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జిల్లాలో 71.07 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటింగ్ లో ప్రముఖులు
అసెంబ్లీ స్పీకర్ , బాన్సువాడ బిఆరెస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం బాన్సువాడ  మండలం పోచారం గ్రామంలో సతీమణి పుష్పతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా స్వామ్యం లో ఓటు ఎంతో విలువైనదని, సరైన నాయకుడిని, పార్టీని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి పథంలోకి పాయనిస్తుందని అన్నారు. కామారెడ్డిలో కలెక్టర్ జితేష్. వి పాటిల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.   కామారెడ్డి నియోజకవర్గంలోని వడ్డెర కాలనీలో గల 215 పోలింగ్ బూతులు ఓటు హక్కును బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటేపల్లి వెంకటరమణారెడ్డి వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని బిజెపి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి పలు ఎలక్షన్ బూతులను  రేవంత్ రెడ్డి సందర్శించారు.  ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.


నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం :

013-జుక్కల్ (SC) : 70.21 శాతం
015-యెల్లారెడ్డి : 74.07 శాతం
016-కామారెడ్డి : 68.94 శాతం
014-బాన్సువాడ: 73.68 శాతం