ఉమ్మడి జిల్లాలో వర్షం-పిడుగు పడి 14 మేకలు మృతి

ఉమ్మడి జిల్లాలో వర్షం-పిడుగు పడి 14 మేకలు మృతి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: గత రెండు రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరిని కోసిన తర్వాత ఆరబోసే సమయంలో వర్షాలు కురవడం, ధాన్యం తడవడంతో వారు నష్టపోతున్నారు. శనివారం పిడుగు పాటుకు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామ రైతుకు చెందిన14 మేకలు మృతి చెందాయి.

సుమారు 2 లక్షల నష్టం వాటిల్లిందని వాపోతున్నాడు.    అలాగే నిజాంసాగర్ మండలంలోని వెలగనూరు గ్రామ శివారులో కేతకి ఇండస్ట్రీస్ లో పిడుగుపాటు పిడుగుపాటు వల్ల పైకప్పులు దెబ్బతిని గోదాంలో పిడుగు పడటంతో సుమారు ఒక లారీ బియ్యం సైతం కాలిపోయాయి. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవు