ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం : డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం : డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, ముద్ర: ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర అందించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, రైతులకు లాభం చేకూరిందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ మార్కెట్ కమిటీలో పీఏ సీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల తో కలిసి ప్రారంభించారు. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని అన్నారు.

 రైతులు పండించిన ధాన్యంను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీరజ వెంకట్రామిరెడ్డి, జడ్పిటిసి పద్మ గోపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్, ఆర్డీవో రాజగౌడ్, తహశీల్దార్ గంగాధర్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, ఎజాజ్, నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు