పిట్లంలో అంబలి కేంద్రం ప్రారంభం

పిట్లంలో అంబలి కేంద్రం ప్రారంభం

పిట్లం, ముద్ర: మండల కేంద్రం లోని స్థానిక అంబెడ్కర్ చౌరస్తాలో అంబలి కేంద్రాన్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి బాబు దొర ఆధ్వర్యంలో  ఎస్సై విజయ్ కొండ చేతుల మీదుగా అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు.  శుక్రవారం సంత దినం కావడంతో వేసవి దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు చలి వేంద్రం మరియు ప్రతి శుక్రవారం అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి , మంచి శశిధర్ , నర్సా  గౌడ్ , షఫీ తదితరులు పాల్గొన్నారు .