అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి- ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 

భువనగిరి ముద్ర న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా  భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా వద్ద  గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి  పూలమాల వేసి  ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...

అంబేద్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిందని అన్నారు.దేశంలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ అని ఆయ అన్నారు.వలస ఆపిన దళితబంధు.. దళిత కుటుంబాల్లో సరికొత్త కాంతులు వేలాగడం జరిగింది అని ఆయన అన్నారు.అంబేద్కర్‌ ఆశయాలకు రూపం కేసీఆర్‌ అని ఆయన చెప్పారు.తాజ్‌మహాల్‌, చార్మినార్‌కు దీటుగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు బాబాసాహెబ్‌ మహోన్నత్వాన్ని చాటేలా ఏర్పాటు అని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర సెక్రటేరియట్‌కు పేరు.. చరిత్రకు సజీవ సాక్ష్యం అని ఆయన అన్నారు.75 ఏండ్ల స్వాతంత్య్రంలో దళితులకు ఒరిగింది శూన్యం అని ఆయన తెలిపారు. దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి అని ఆయన అన్నారు.తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల సంక్షేమం అని ఆయన అన్నారు.దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్  సాకారం చేస్తున్నారని అన్నారు.నేడు దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.బిఆర్‌ఎస్‌తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని అని ఆయన అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో తెలంగాణ దళిత బంధు పథకం అమ‌లు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.భారతావ‌నిలో ద‌ళిత వాడ‌లు ఇంకా అలాగే ఉన్నాయని, అయితే వారి జీవితాల్లో పెద్ద‌గా మార్పు రాలేద‌న్నారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నద‌ని ఆయన చెప్పారు. డా.బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌య సాధ‌న కోసం ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు  కృషి చేస్తున్నార‌ని తెలిపారు.