శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహన సేవలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడు

శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహన సేవలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడు

యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 28 (ముద్ర న్యూస్)యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం యాదగిరిశుడు శ్రీరామ అలంకారంలో హనుమంత వాన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు .ఉదయం నిత్య ఆరాధనలను అనంతరం శ్రీ స్వామి వారు శ్రీరామ అలంకారం గావించి హనుమంత వాహన సేవలో వజ్రవైఢూర్యాలు ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధులలో ఊరేగించారు.

ప్రధానాచార్యులు నల్లన్ తీగల్ లక్ష్మీనరసింహాచార్యులు యాజ్ఞాచార్యులు ఉప ప్రధానార్చకులు అర్చక బృందం పారాయనీకులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు వై టి డి ఏ వైస్ చైర్మన్ కిషన్ రావు,ఈఓ గీత, చైర్మన్ నరసింహమూర్తి ,డిఇఓ దోర్బల భాస్కర శర్మ ,ఏఈవోలు రామ్మోహన్ ,గజ్వేల్ రమేష్ బాబు, గట్టు శ్రవణ్ కుమార్ గుప్తా ,సూపరిండెంట్లు సురేందర్ రెడ్డి ,వాసం వెంకటేశం,  శ్రవణ్ ఇతర అధికారులు ఉన్నారు. సాయంకాలం నిత్యా ఆరాధనల అనంతరం శ్రీ స్వామి అమ్మ వారు గజవాహన సేవలో తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరారు .పాంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం రాత్రి శ్రీ స్వామివారి తిరు కళ్యాణోత్సవ వేడుకలు జరిగాయి .ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.