ఆలేరులో బిఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం..

ఆలేరులో బిఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం..

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరు శాసనసభ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కోరుతూ శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వీధులలో కలియ తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్. నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ఓటర్లను కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు. వర్గంలో చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి తమదైన శైలిలో ఓట్లును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్. మున్సిపల్ కౌన్సిలర్ జూకంటి శ్రీకాంత్ తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. బిఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు....