రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి...

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి...
  • 20 మంది డాక్టర్లు ఉండవలసిన చోట కేవలం 4 గురు డాక్టర్ల తో సరి...
  • 1970 లో నిర్మాణం చేసిన ఆసుపత్రి భవనం..
  • కాలంచెల్లిన పాత భవనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం...
  • 3 వ కాన్పు నల్లగొండ కే రెఫర్... ఏమర్జన్సీ కేసులు అంతే ఏమర్జన్సీ గా బయటికి పంపడం..

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట  ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల కు నిలయం గా మారింది. 1970 లో నిర్మాణం చేసిన ఈ ఆసుపత్రిలో పరిసరాలు అద్వాన్నంగా ఉన్నాయి. 20 మంది డాక్టర్లు ఉండవలసిన చోట కేవలం 4గురు డాక్టర్ల తో నెట్టుకు రావడం జరుగుతుంది. 3 వ కాన్పుకు నల్లగొండ గొల్లగూడా ఆసుపత్రికి రిపర్ చేయడం పరిపాటిగా మారింది. 53 సంవత్సరాల పురాతన భవనం లోనే ఆసుపత్రి కొనసాగడంతో ప్రజలు భయపడుతున్నారు.

వైద్య రంగంలో ప్రజలకు అన్ని రకాలుగా వసతులు కల్పించడములో దేశంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఈ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి కానరావడం లేదా అని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆసుపత్రుల మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి సమస్యల ను వెంటనే పరిష్కరించే విదంగా ప్రయత్నం చేయాలని కాలం తీరిన భవనాలు వెంటనే డిసిమెంటల్ చేసి కొత్త భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆసుపత్రులకు సరిపోను డాక్టర్లను అవసరం ఉన్న అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.